పులివెందుల చేరుకున్న వైయస్‌ జగన్

పులివెందుల (వైయస్ఆర్‌ జిల్లా) :

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. ఆయనతో పాటు మాతృమూర్తి శ్రీమతి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబ సభ్యులు కూడా పులివెందుల వచ్చారు. మూడు రోజుల పాటు వారంతా పులివెందులలోనే ఉంటారు. పులివెందులలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్‌ను పురస్కరించుకుని పులివెందుల సీఎస్ఐ చర్చిలో శ్రీ జగన్‌ సహా కుటుంబ సభ్యులంతా ప్రార్థనలు చేస్తారు. అనంతరం ప్రజలను శ్రీ జగన్‌ కలుసుకుంటారు.

శ్రీ జగన్‌ పులివెందుల వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనను క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కడప జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top