రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ పాదయాత్ర కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బైక్‌ ర్యాలీలు, పాదయాత్ర చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. అనంతరం చెంబేడులో బహిరంగ సభ నిర్వహించి వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి వివరించారు. 
గుంటూరు జిల్లా
నవరత్నాలతో ప్రజలందరి జీవితాలు మెరుగుపడతాయని గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త మోపిదేవి వెంకటరమణ అన్నారు. కొలగానివారి పాలెం, నాగిశెట్టివాని పాలెంలో మోపిదేవి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. 
విశాఖ తూర్పులో..
వైయస్‌ జగన్‌తోనే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ తిరిగి వస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. నియోజకవర్గ పరిధిలో వంశీ కృష్ణ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల గురించి వివరించారు. అదే విధంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు.  
కృష్ణా జిల్లా..
కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. 
 
Back to Top