ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజ్ ఇవ్వాలి

()ఓటు కోట్లు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడు
()కమీషన్ ల కోసమే టీడీపీ ప్యాకేజీ పాట పాడుతోంది
()ప్రత్యేకహోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీవరకు పోరాటం చేశాం
()ప్రజల పక్షాన పోరాడే నిజమైన నాయకుడు వైయస్ జగన్
()ప్యాకేజీల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ నాయకుడే కాదు

హైదరాబాద్ః రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు పది, పదిహేనేళ్లు కావాలన్న టీడీపీ, బీజేపీ నేతలు స్పెషల్ స్టేటస్ అంటేనే షాక్ కొట్టినట్టు ఎందుకు పారిపోతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా పట్టించుకోకుండా....టీడీపీ నేతలు కమీషన్ ల కోసం ప్యాకేజీ పాట పాడుతున్నారని ధ్వజమెత్తారు.  బాబు తన స్వప్రయోజనాల కోసం హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టాడని రోజా ఆగ్రహించారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు హోదాను కోరుతుండడం వల్లే మేము పోరాడుతున్నామంటూ అధికార టీడీపీ కలరింగ్ ఇస్తుంది తప్ప  చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. షూటింగ్ లేని ఖాళీ సమయాల్లో ఎప్పుడో ఓ సారి వచ్చి పవన్ కళ్యాణ్ హోదా కోసం మాట్లాడితే దాన్ని అన్ని చానల్స్ చూపించాయని, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రత్యేకహోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాడుతుంటే అది అవసరం లేదన్నట్లు ఎవరూ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 

హోదా కోసం  పోరాడే ప్రతీ ఒక్కరికీ అండగా నిలబడాలని, తమ ఉద్యమానికి సహకరించాలన్నారు.  ప్రత్యేకహోదా కోసం నిజాయితీగా పోరాడే వారికి వైయస్సార్సీపీ మద్దతు ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు.  ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రత్యేకహోదా కోసం మొదటినుంచి పోరాడుతుంది ఒక్క వైయస్సార్సీపీయేనని రోజా కుండబద్దలు కొట్టారు.  ఆ క్రెడిట్ ను కొట్టేసేందుకు ప్రభుత్వ స్పాన్సర్ గా కొంతమంది వస్తున్నారని పవన్ కళ్యాణ్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం కొంతమందిని వాడుకుంటోందని విమర్శించారు. గుంటూరులో రైతుల భూములు లాక్కుంటున్నారని అక్కడికివెళ్లి  పెరుగన్నం తిని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి హైదరాబాద్ వచ్చాక ఎందుకు చల్లబడ్డారని నిలదీశారు. 

ఎంత కష్టమొచ్చినా ప్రజల పక్షాన నిలిచి ఎదురించి పోరాడే వాడే నిజమైన నాయకుడని, అది వైయస్ జగన్ మాత్రమేనని రోజా చెప్పారు. అంతేగానీ, ప్యాకేజీల కోసం ఖాళీ సమయాల్లో పనిచేసేవారిని నాయకుడు అనరని పవన్ కళ్యాణ్ ను ఎత్తిపొడిచారు. వైయస్ జగన్ ను ఓదార్పు యాత్ర చేయకుండా అడ్డుపడ్డారని,  ఎదిరించి ప్రజల పక్షాన నిలబడినందుకు జైల్లో పెట్టి నీచ రాజకీయాలు చేశారని రోజా ఫైర్ అయ్యారు. ఐనా కూడా ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా పోరాడుతున్న నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు. ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజీ ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లే బాధ్యత వహించి  రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. అలా చేయలేకపోతే వైయస్ జగన్ పోరాటనికి మద్దతు ఇవ్వాలని సూచించారు.  

హోదాకు బాబే అడ్డంకి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడేనని వైయస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తుని ఘటనలో వైయస్ఆర్ సీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో రెయిన్ గన్ల ద్వారా పంటలను కాపాడటం బోగస్ అని దుయ్యబట్టారు. 

తాజా వీడియోలు

Back to Top