సాంప్రదాయానికి విరుద్ధంగా సభను నడిపిస్తున్న స్పీకర్‌

  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయమన్నామంటే చాలెంజ్‌ ఒప్పుకున్నట్లా.. కాదా..?
  • ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు
  • వైయస్‌ జగన్‌ మూడు చాలెంజ్‌లను కూడా సభ నుంచి కొనసాగించాలి
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
వెలగపూడి: సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్‌ అసెంబ్లీని నడిపిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తొడ కొడితేనే మైక్‌ ఇస్తా అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు వేలంపాట బిజినెస్‌లాగా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కరువుపై చర్చకు స్పీకర్‌ అనుమతిచ్చినట్లే ఇచ్చి...  చర్చను తప్పుదోవ పట్టించమని  వారి సభ్యులకు ఇండికేషన్స్‌ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్డీతో విచారణకు ఒప్పుకున్నామంటే చాలెంజ్‌కు ఒప్పుకున్నట్లా కాదా అని టీడీపీని ప్రశ్నించారు. జ్యుడీషియల్‌ ఎంక్వైరీకి ఒప్పుకున్న తరువాత ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని, గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మా సవాళ్ల నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారు?
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పార్టీకి సవాళ్లు విసిరితే వాటిని స్వీకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో వైయస్‌ జగన్‌ మూడు చాలెంజ్‌లు చేశారని గుర్తు చేశారు. ఓటుకు కోట్ల కేసులోని వాయిస్‌ మీదా.. కాదా.? అని చాలెంజ్‌ విసిరితే అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రతీసారి లక్షల కోట్లు సీబీఐ స్వాధీనం చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆస్తుల్లో 10 శాతం ఇచ్చి మిగిలింది మీరు తీసుకోండి అని చాలెంజ్‌ విసిరితే దాని నుంచి తప్పించుకున్నారన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు తలొగ్గి టీడీపీలో చేరిన 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు పోదామని చాలెంజ్‌ విసిరితే దాని నుంచి కూడా చంద్రబాబు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ విసిరిన మూడు చాలెంజ్‌లకు ఎందుకు ముందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే స్పీకర్‌ వీటిని కూడా హౌస్‌ నుంచి కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.
Back to Top