ప‌లాస‌లో పండుగ‌



మరికొద్ది సేపట్లో పలాసలో వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ...
సభాస్థలికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న ప్రజలు
సభా ప్రాంగణంలో వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు,జెండాలు రెపరెపలు..
శ్రీకాకుళంః నేడు సాయంత్రం పలాస కె.టి.రోడ్డులో జరగనున్న వైయస్‌ జగన్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.సభా ప్రాంగణం అంతా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు,ప్లెక్సీలతో నిండిపోయింది.ప్రజలందరూ సభా స్థలికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.పలాస నియోజకవర్గం సమస్యలపై జననేత ప్రసంగం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు, అవినీతి, దోపిడీపై బహిరంగ సభల్లో వైయస్‌ జగన్‌ ఎండగడుతున్న తీరు పట్ల ప్రజలు హర్షం చేస్తున్నారు.తమకు అండగా నిలబడేది వైయస్‌ జగన్‌ ఒక్కరేనని ప్రజలందరూ భావిస్తున్నాయి. ఎలాంటి టీడీపీ పాలనలో దోపిడీయే తప్ప అభివృద్ధి కనబడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జన్మభూమి కమిటీలకు  విలువనిస్తూ ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు. ఎక్కడా ఖాళీ స్థలం కనిపెడితే అక్కడ స్థానిక  ఎమ్మెల్యే అల్లుడు కబ్జా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండకుండా దోచుకునే పనిలో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పలాస ప్రజలు అన్నారు. మత్స్యకారులు వలసపోతున్నారని, వారి ఇబ్బందులు గుర్తించిన జగన్‌ మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుపాన్‌ నష్టపరిహారంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని అర్హులకు పరిహారం అందడంలేదని బాధితులు వాపోయారు.వైయస్‌ జగన్‌ వస్తేనే ప్రజలందరికి న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబుపై నమ్మకం పోయిందన్నారు. 
Back to Top