సోమయాజులు లోటు తీరనిది

హైదరాబాద్‌: సోమయాజులు లేని లోటు తీర్చలేనిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల మరణించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు డివి సోమయాజులు సంస్మరణ సభను హైదరాబాద్‌ జలవిహాలో ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ఒక స్వరూపం ఇవ్వడంలో సోమయాజులు మేధోసంపత్తి చాలా ఉపయోగపడిందని గుర్తు చేశారు. సోమయాజులు మరణం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ సీపీని అన్ని విధాలుగా బాధించిందన్నారు. కీలకమైన దశలో ఆయన మృతి చెందడం పార్టీకి, వ్యక్తిగతంగా అనేక లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. సోమయాజులు సంస్మరణ సభలో పార్టీ సీనియర్ నాయకులు బొత్ససత్యనారాయణ, అధికాకార ప్రతినిధి అంబటి రాంబాబు, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతితోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, రిటైర్డు అధికారులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top