సోకులగూడెంలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

గిరిజనులకు అనంతబాబు సాదర ఆహ్వానం 
రంపచోడవరం : టీడీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీడీపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే  సోకులగూడెంలోని మొత్తం గిరిజనులు దండుగా వైయస్సార్‌ సీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు) సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైయస్ జగన్ పై విశ్వాసంతో పార్టీలో చేరినట్టు వారు చెప్పారు. గిరిజన తెగల్లో తేడాలు చూపుతూ ఒక వర్గానికి పింఛను మంజూరు చేస్తున్నారని, గ్రామానికి కనీసం రోడ్డు కూడా లేదని వారు వాపోయారు. భవిష్యత్తులో సమస్యలు తీరాయతాయన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ... గిరిజనులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇదే పరిస్థితి ఏజెన్సీలో అనేక గ్రామాల్లో ఉందన్నారు. గిరిజనుల సమస్యలు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. సోకులగూడేనికి చెందిన వెంకటేశ్వర్లు, సండ్రు ప్రసాద్‌లుతో కలిసి సుమారు 150 మందికి పైగా పార్టీలో చేరారు. వీరికి అనంతబాబు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ మండల కన్వీనర్‌ జల్లేపల్లి రామన్నదొర, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ పత్తిగుళ్ల భారతి, సర్పంచిల సమాఖ్య అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ కారుకోడి పూజ, పార్టీ యూత్‌ అధ్యక్షుడు రాపాక సుదీర్, మహిళ అధ్యక్షురాలు కాపారపు రూతూ, ప్రచార కమిటీ వీఎం కన్నబాబు, ఖాన్, జాఫర్, పరదా బాబురావుదొర, బొప్పా సత్యనారాయణ, విశాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top