శోభ భౌతికకాయం వద్ద విజయమ్మ కంటతడి


ఆళ్ళగడ్డ (కర్నూలు జిల్లా) :

వైయస్ఆర్ కాంగ్రెస్‌ కీలక నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని చూడగానే‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కంటతడి పెట్టారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గురువారం తుదిశ్వాస విడిచిన శోభా నాడిరెడ్డికి శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం నివాళులు అర్పించారు. శ్రీ జగన్‌తో పాటు శ్రీమతి వైయస్ విజయమ్మ,‌ శ్రీమతి షర్మిల, శ్రీమతి భారతి శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. శోభా నాగిరెడ్డి భౌతికకాయం వద్దకు శ్రీ జగన్, కుటుంబ సభ్యులు చేరుకోగానే భూమా నాగిరెడ్డితో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు భోరున విలపించారు.

భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులను చూసిన శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి కూడా ఉద్వేగానికి గురయ్యారు. శ్రీమతి వైయస్ విజయమ్మ,‌ శ్రీహతి షర్మిల, శ్రీమతి భారతి కంటనీరు పెట్టారు. శోభా నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. భూమా నాగిరెడ్డికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శోభా నాగిరెడ్డి భౌతికకాయంపై శ్రీమతి విజయమ్మ పుష్పగుచ్ఛాన్ని ఉంచగా, శ్రీ జగన్ నివాళులర్పించారు.‌‌ ఆ తర్వాత అంతిమ యాత్రలో శ్రీ ‌వైయస్ జగన్ పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు, బంధువులతో మాట్లాడారు. కార్యకర్తలు, నేతల్లో ధైర్యాన్ని నింపారు.

Back to Top