శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పాదయాత్ర ప్రారంభం

కెల్ల (శ్రీకాకుళం జిల్లా),

21 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం సాయంత్ర శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టింది. పాలకొండ నియోజకవర్గం కెల్ల నుంచి ఆమె జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, 16 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పాలకొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు. కెల్ల వద్ద శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికేందుకు వైయస్‌ అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు విశేష సంఖ్యలో తరలి వచ్చారు. మహిళలైతే మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆమెకు హార్దికంగా స్వాగతం పలికారు.

Back to Top