చంద్రయ్యపేట వరకూ షర్మిల నేటి పాదయాత్ర

మాడుగుల (విశాఖ జిల్లా),

1 జూలై 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌తనయ, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 196వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం గుల్లేపల్లి నుంచి ప్రారంభమైంది. సోమవారం పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు ‌వివరించారు.

గుల్లేపల్లి నుంచి శ్రీమతి షర్మిల బట్టివానిపాలెం మీదుగా కె.కొత్తకోట సమీపానికి చేరుకుంటారు. కె.కొత్తకోట సమీపంలో ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం ఆమె రామచంద్రపురం, సంతపాలెం మీదుగా చంద్రయ్యపేట చేరుకుంటారు. రాత్రికి చంద్రయ్యపేట సమీపంలో బస చేస్తారు.

Back to Top