కావలి నుంచి షర్మిల సమైక్య శంఖారావం

కావలి (నెల్లూరు జిల్లా),

10 సెప్టెంబర్ 2013: సమన్యాయం లేదు కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్ర మంగళవారం ఉదయం కావలి నుంచి ప్రారంభమైంది. ఆమె ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురంలో శ్రీమతి షర్మిల పర్యటిస్తారు. కనిగిరి బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి మార్కాపురం బయలుదేరి వెళతారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలోనూ శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జరుగుతున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా‌ శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించారు. శ్రీహతి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తున్నాయి. శ్రీమతి షర్మిల ప్రసంగాలు వినేందుకు సమైక్యవాదులు భారీగా తరలి వస్తున్నారు.

ఇలా ఉండగా.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు కోడూరు సుధాకర్‌రెడ్డి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు శ్రీమతి షర్మిల సంతాపం తెలిపారు.

Back to Top