షర్మిల 229వ రోజు పాదయాత్ర షెడ్యూల్

ఇచ్ఛాపురం, (శ్రీకాకుళం జిల్లా) :

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 229వ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జలంత్రకోట జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలో ఆమె పాదయాత్ర 14వ రోజు శనివారం కొనసాగుతోంది. శ్రీమతి షర్మిల నేటి పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ ధర్మాన పద్మప్రియ ‌తెలిపారు. జలంత్రకోట జంక్షన్, కంచిలి, బైరిపురంల మీదుగా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. బైరిపురం సమీపంలో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత శ్రీమతి షర్మిల సంత, జాడుపూడి, గొర్లెపాడు, ఆర్.కరాపాడు, కవిటి జంక్షన్‌ల మీదుగా గుడ్డిభద్ర చేరుకుంటారు. శనివారం రాత్రికి శ్రీమతి షర్మిల గుడ్డిభద్ర సమీపంలో బస చేస్తారని రఘురాం, పద్మప్రియ తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top