పార్వతీపురంలో నేడు షర్మిల బహిరంగ సభ

పార్వతీపురం (విజయనగరం జిల్లా),

20 జూలై 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 215వ రోజు శనివారం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. కాగా జిల్లాలో పదమూడవ రోజు ఆమె పాదయాత్ర చేస్తున్నారు. శనివారంనాటి పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ పెనుమత్స సాంబశివరాజు ‌తెలిపారు.

శనివారం ఉదయం విజయనగరం జిల్లా నర్సిపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యర్రా కృష్ణమూర్తి కాలనీ మీదుగా పార్వతీపురం వరకూ పాదయాత్ర చేస్తారు. పార్వతీపురంలో ఉదయం జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం కొత్తవలసలో పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం ఉల్లిభద్ర జంక్షన్, సుంకి గ్రామాల్లో ఆమె పాదయాత్ర చేసి రాత్రికి సుంకి సమీపంలో బస చేస్తారని రఘురాం, సాంబశివరాజు వివరించారు.

Back to Top