బ్రిడ్జి నిర్మించాలి

ఏపీ అసెంబ్లీ: వాల్తేర్‌ పంచాయతీలో బలసలరేవు బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే కంబాల జోగులు డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జి ఇసుకలపేట ఆముదాలవలస నియోజకవర్గంలో ఉంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మిగతా పనులు చేస్తున్నారే తప్ప ఈ బిడ్జిని పట్టించుకోవడం లేదు. బ్రిడ్జి నిర్మిస్తే 60 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్లు తగ్గుతుంది. శ్రీకాకుళం వెళ్లేందుకు వీలుంటుంది. ఈ బ్రిడ్జి కోసం నెల రోజులుగా ఆ ప్రాంత వాసులు దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ బ్రిడ్జి ఆ ప్రాంతవాసులకు చిరకాల కోరికగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు.

Back to Top