ఆడపడుచుల్లో ముఖాల్లో సంతోషం నిండాలి

విశాఖపట్నం) ఆడపడుచుల
ముఖాల్లో సంతోషం వెల్లివిరియాలని, అటువంటి పరిస్థితుల కోసం తాము పోరాడుతామని
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభిలషించారు. విశాఖ జిల్లా
పర్యటనలో భాగంగా ఆయన అచ్యుతాపురం ఎస్ ఈ జడ్ లో ఉన్న బ్రాండిక్స్ ఫ్యాక్టరీ
ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బహిరంగ సమావేశం నిర్వహించి మహిళా సిబ్బందితో ముఖాముఖి
మాట్లాడారు. ఆడపడుచులకు న్యాయమైన కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేదంటే తాము కూడా పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు. ఈ వేదిక మీద ఆవేదన పంచుకొన్న
చెల్లెమ్మల్ని ఇబ్బంది పెడితే సహించబోమని స్పష్టం చేశారు. మహిళల జీవితాల్లో
వెలుగుల కోసం పోరాడుతామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top