బాబు తప్పుకో

హైదరాబాద్ః ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగడంపై వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బాబు పేరు 22 సార్లు చార్జిషీట్ లో నమోదైందని...దీనికి బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓ అవినీతి కేసులో సీఎంపై ఆరోపణలు , కోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. బాబు తక్షణమే రాజీనామా చేయాలని బొత్స డిమాండ్ చేశారు. 
Back to Top