నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకొవాలి

ఆత్మకూరుః పరీక్షా ప్రశ్నా పత్రాలను లీకేజీ చేసి విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం అడుతున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం మండల కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు . గురువారం వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు. ర్యాంకుల కోసం అడ్డదారిలో నారాయణ విద్యాసంస్థలు లీకేజులకు పాల్పడుతూ కష్టపడి చదువుకున్న ఎంతోమంది విద్యార్థులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. నారాయణ వియ్యంకుడు, విద్యాశాఖమంత్రి గంటా లీకేజీలను కప్పి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకొకపొతే ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం నాయకులు సాయినాథ్‌రెడ్డి , మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top