అక్ర‌మ నిర్మాణంపై చ‌ర్య‌లు తీసుకోవాలి

పామిడి: పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆనుకొని నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మండల కన్వీనర్ దేవరపల్లి నారప్ప త‌హ‌శీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణంతో కళాశాల పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని వివ‌రించారు. అక్ర‌మ నిర్మాణం పోకిరీలకు అడ్డగా మారి విద్యార్థినీల శాంతిభద్రతలకు భంగం వాటిల్లింపజేస్తుందన్నారు. తద్వారా తక్షణం ఆ అక్రమ నిర్మాణ తొలగింపుకు సత్వరచర్యలు చేపట్టాలని కోరారు.

Back to Top