జగన్ పేరు వింటేనే కాంగ్రెస్, టీడీపీలకు ‌హడల్

తిరుపతి, 2 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేరు వింటేనే కాంగ్రెస్, టిడిసిలకు వణుకు పుడుతోందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. కుమ్మక్కు రాజకీయాలు మన రాష్ట్రంలో పరాకాష్టకు చేరుకున్నాయని ఆయన ఆరోపించారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనకు వెళ్లిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ‌ను అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మాత్రం పూలతో స్వాగతం చెబుతున్నారని భూమన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి ఇంత కంటే ప్రబల ఉదాహరణ ఇంకా ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు.

Back to Top