- ఈనెల 26 నుంచి జూన్ 4వరకు యాత్ర
- నియోజకవర్గ అభివృద్ధి పట్టని సర్కార్
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్న పద్మావతి
- నియోజకవర్గ వ్యాప్తంగా150 కి.మీ. మేర పాదయాత్ర
అనంతపురంః టీడీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త పద్మావతి మేలుకొలుపు పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు. పద్మావతి, జిల్లా యువజన అధ్యక్షులు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి జూన్ 4వరకు 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్టు పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా పార్టీ కార్యలయంలో విడుదల చేశారు.
సింగనమల నియోజకవర్గంలో ఇరిగేషన్ సౌకర్యాలను కుదించే పద్ధతిలో ప్రభుత్వం ఉందని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. హంద్రీనీవా నుంచి 28 టీఎంసీల నీళ్లు వచ్చినా కూడ వృథా చేశారని, హెఎల్ సీ కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లి ఇచ్చి కాపాడమన్నా అధికార పార్టీ ఖాతరు చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా సింగనమల నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యపరుస్తారని చెప్పారు.
వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజాసమస్యలపై ప్రజలకు అండగా ఉంటూ ఏవిధంగా పోరాటాలు చేస్తున్నామో, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఏవిధంగా ఎండగడుతున్నమో పద్మావతి వివరిస్తారని వారు తెలిపారు. నియోజవర్గ వ్యాప్తంగా మేలుకొలుపు పేరుతో పాదయాత్ర చేస్తూ రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చేవిధంగా పద్మావతి పాదయాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. అందరూ స్వాగతించి పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.