వాహనం ఢీకొని మహిళ మృతి

చిరుమానుదొడ్డి

12 నవంబర్ 2012 : షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో సోమవారం ఒక మహిళ వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలకు గురై మరణించారు. షర్మిలను చూడాలన్న ఆత్రుతలో అయ్యమ్మ(65) అనే మహిళ వాహన ప్రమాదానికి గురయ్యారు. చిరుమానుదొడ్డి నుండి అర కిలోమీటరు దూరంలో ఉదయం 10.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. గాయపడిన మహిళను అదే వాహనంలో వారు షర్మిల దగ్గరకు చేర్చారు. ప్రమాద తీవ్రతను గమనించిన షర్మిల తన పాదయాత్ర వెంట ఉన్న 'అంబులెన్స్‌'లోనే హుటాహుటిన ఆమెను ఆదోని ఆసుపత్రికి తరలింపజేశారు. ఆ తర్వాత తదుపరి చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి పంపారు. అయితే అయ్యమ్మ మృతి చెందారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమైందని షర్మిల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Back to Top