షర్మిల పాదయాత్రతో ప్రభంజనం



ఉరవకొండ

4 నవంబర్ 2012 : షర్మిల పాదయాత్ర మరో ప్రభంజనం సృష్టిస్తుందని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న మహిళగా షర్మిల చరిత్రలో నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ వంటి దుష్టశక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా జననేత జగన్‌ సీఎం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. శనివారం ఉరవకొండ క్లాక్ టవర్ వద్ద జరిగిన భారీ బహిరంగసభలో విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. జగన్‌‌ను జైల్లో పెట్టి,  వైయస్ఆర్ సీపీని మెగ్గతొడుగుతున్న దశలోనే చిదిమేయాలని కాంగ్రెస్, టీడీపీ చేసిన కుట్రను ప్రజలు తిప్పి కొట్టారని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి, టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారనీ ఆయన పేర్కొన్నారు. షర్మిల నడస్తుంటే అచ్చం మహానేత వైయస్ నడిచినట్టే ఉందనీ, ఆమెలో జనం రాజన్నను చూసుకుంటున్నారనీ ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హిందూపురంలోని చక్కెర ఫ్యాక్టరీ, గుంతకల్లులోని స్పిన్నింగ్ మిల్లు మూతబడ్డాయని, పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన విమర్శించారు. వైయస్ నాడు ఉరవకొండ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. 90 వేల ఎకరాలకు నీరు అందించే హంద్రీ-నీవాను వైయస్ ప్రారంభించారని, వేలాది వుందికి ఇళ్లు, పింఛన్లు అందించిన ఘనత మహానేతదేనని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాయుదుర్గం ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల అడ్రస్సులు గల్లంతవడం ఖాయమన్నారు. ఆ రెండు పార్టీలూ మునిగే పడవల్లాటివన్నారు. జగన్‌ జనాదరణకు ఉప ఎన్నికలే తార్కాణమన్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి, టీడీపీ నేతలకు దిమ్మ దిరిగిందన్నారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని గమనించిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అక్రమకేసులు బనాయించి జగన్‌ను జైలు పాలు చేశారన్నారు. అనంతపురంజిల్లాలో జగన్ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. షర్మిల పాదయూత్రతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వైయస్ఆర్ సీపీ నాయకులు వై.వుధుసూదన్‌రెడ్డి,  మీసాల రంగన్న, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తొపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, బోయ సుశీలమ్మ తదితరులు ఈ సభలో ప్రసంగించారు.

Back to Top