షర్మిల పాదయాత్ర 14వ రోజు ‌షెడ్యూల్ ఇదీ

అనంతపురం, 31 అక్టోబర్‌ 2012:  వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం ఉదయం అనంతపురం- బళ్లారి రోడ్డులోని కమ్మూరు క్రాస్ (అగ్రిగో‌ల్డు ఎస్టేట్) నుంచి ప్రారంభమై అరవకూరు, కూడేరు మీదుగా కొనసాగుతుంది. సాయంత్రం కూడేరులో నిర్వహించే బహిరంగసభలో షర్మిల పాల్గొంటారు. రాత్రికి ముద్దలాపురం సమీపంలో షర్మిల బస చేస్తారు. బుధవారం మొత్తం 12 కిలోమీటర్ల దూరాన్ని షర్మిల నడవనున్నారని పార్టీ నాయకులు తలశిల రఘురాం, వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

గురువారంనాడు 13 కిలోమీటర్ల పాదయాత్ర:
షర్మిల పాదయాత్ర గురువారం ముద్దలాపురం నుంచి ప్రారంభమై వైయస్‌ఆర్ వాట‌ర్ ప్రాజెక్టు, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట వరకు సాగుతుంది. భంభంస్వామి గుట్ట వద్ద రాత్రి బస చేస్తారు. ‌గురువారంనాడు షర్మిల మొత్తం 13 కిలోమీటర్లు నడుస్తారు. 

తాజా వీడియోలు

Back to Top