షర్మిలకు నల్లగొండ బ్రహ్మరథం

నల్లగొండ 12 ఫిబ్రవరి 2013:

నల్లగొండ నియోజకవర్గం శ్రీమతి వైయస్ షర్మిలకు బ్రహ్మరథం పట్టింది. మునుగోడు నియోజకవర్గంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను పూర్తిచేసి ఆమె మంగళవారం నల్లగొండ నియోజకవర్గంలో ప్రవేశించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిమానుల విజ్ఞప్తి మేరకు ఆమె జి. యడవల్లి గ్రామంలో మొక్కలు నాటారు. జయహో వైయస్ఆర్ నినాదాలు మార్మోగాయి. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో వేలాదిమంది శ్రీమతి షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి శ్రీమతి షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. గతంలో మహానేత రాజశేఖరరెడ్డి పాదయాత్రలో తాను 500 కిమీ నడిచానని ఆయన తెలిపారు. ఆయన మీద ఉన్న అభిమానంతో పాదయాత్రలో పాల్గొన్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు నుంచి ఆయన వెంట నడిచానన్నారు. ఇప్పుడు ఇడుపులపాయనుంచి యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇచ్చాపురం దాకా కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నానీ, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నదే తన కోరికనీ ఆయన వివరించారు. ప్రజల్లో వైయస్ఆర్ కుటుంబమంటే ఎనలేని అభిమానం ఉందనీ, దానికి తార్కాణం షర్మిల వెంట నడుస్తున్న జనమేననీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.
నల్గొండ నియోజకవర్గంలోని కుర్రంపల్లిలో మహిళలు శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు అంతా మంచి జరిగిందనీ, ఇప్పుడంతా కరవేనని మహిళలు చెప్పారు. ఆయన కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకనే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. వైయస్ఆర్ ఉన్నప్పుడు పిల్లలనుంచి అందరూ ఆనందంగా ఉన్నారని ఆ గ్రామ మహిళలు చెప్పారు. వృద్ధులకు పింఛన్లు సకాలంలో అందేవనీ, ఇప్పుడు ఉన్నవి కూడా తొలగిస్తున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top