షర్మిలకు నల్గొండజిల్లా ఆత్మీయ వీడ్కోలు

నల్గొండ : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు నల్గొండ జిల్లా ప్రజలు, అభిమానులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నల్లగొండ జిల్లాలో శనివారం సాయంత్రంతో ముగిసింది. నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర మాల్ వద్ద ‌ఫివ్రబరి 8వ తేదీన ప్రారంభమైంది. దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలలో విజయవంతంగా ‌కొనసాగింది.

దామరచర్ల మండలంలోని వాడపల్లి శివారు నుంచి శ్రీమతి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. వాడపల్లికి చేరుకోగానే ఆమె రచ్చబండ కార్యక్రమం నిరహించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆ గ్రామంలోని కృష్ణానది వంతెన సమీపంలో మధ్యాహ్నం భోజనం ముగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లాలోని పొందుగలకు వెళ్తున్న శ్రీమతి షర్మిలకు జిల్లాకు చెందిన నాయకులు వీడ్కోలు పలికారు.

శ్రీమతి షర్మిలకు వీడ్కోలు పలికిన నల్గొండ జిల్లా వారిలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ దక్షిణ తెలంగాణ జిల్లాల ఇ‌న్‌చార్జి జిట్టా బాలకృష్ణారెడ్డి, నల్గొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, సీఈసీ సభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు‌, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పాదూరి కరుణ, జిల్లా ప్రచార కార్యదర్శి కె.ఎల్ఎ‌న్ ప్రసా‌ద్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇంజం నర్సిరెడ్డి, కేమిశెట్టి భీమరాజు, సిరా‌జ్‌ఖాన్, మల్ల రవీంద‌ర్‌రెడ్డి, చిలకల శ్రీనివాస్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.డిజ ఖాసిం, చెవుల కవిత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అలక శ్రవణ్‌రెడ్డి, దళిత విభాగం జిల్లా కన్వీనర్ ఇరుగు సునీ‌ల్ కుమా‌ర్, జిల్లా నాయకులు శ్రీకళారెడ్డి, బోయపల్లి అనంతకుమా‌ర్, ఎర్నేని వెంకటరత్నంబాబు, పోరెడ్డి నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top