షర్మిలకు మద్దతుగా పాద యాత్ర

అమలాపురం:

మరో ప్రజా ప్రస్థానం పేరిట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా సీబీసీఎన్‌సీ విద్యాసంస్థల చైర్మన్ ముత్తాబత్తుల రత్నకుమార్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. కాకినాడ నుంచి తన మద్దతుదారులతో ఎదుర్లంక, ముమ్మిడివరం, భట్నవిల్లి మీదుగా అమలాపురం కిమ్సు ఆస్పత్రి వరకు బైక్‌లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అక్కడ అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలిసి రత్నకుమార్ పాదయాత్ర ప్రారంభించారు. బ్యాండు మేళాలు, యువకులు మోటార్ సైకిళ్లతో వెంటరాగా ఎర్రవంతెన మీదుగా హైస్కూల్ సెంటర్‌కు పాదయాత్ర చేరింది. అక్కడ మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైస్కూల్ సెంటర్‌లో పార్టీ నాయకుడు వక్కలంక కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభలో రత్నకుమార్ మాట్లాడుతూ జగన్ అభిమానిగా షర్మిల పాదయాత్రను విజయవంతం కోరుతూ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించానన్నారు.

Back to Top