నేడు విజయనగరానికి పాదయాత్ర

విజయనగరం 08 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ  వై.యస్. జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లాలో అడుగిడనున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించిన సోమవారానికి 203వ రోజుకు చేరుకుంది.  విజయనగరం జిల్లాలో తొలి రోజు యాత్ర  వివరాలను పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త  తలశిల రఘురాం, ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెనుమ త్స సాంబశివరాజు తెలిపారు. శ్రీమతి షర్మిల సోమవారం సాయంత్రం 4 గంటలకు కొత్తవలస మండలంలోని చింతలపాలెం వద్ద జిల్లాలో అడుగుపెడతారు. అక్కడినుంచి దేశపాత్రుని పాలెం, మంగళపాలెం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగించి కొత్తవలస జంక్షన్‌కు చేరుకుంటారు. కొత్తవలస జంక్షన్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొత్తవలసలోనే బస చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top