204వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

కొత్తవలస(విజయనగరం) 09 జూలై 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి  శ్రీమతి వైయస్ షర్మిల 204వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. మరోప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారంనాడు కొత్తవలస నుంచి మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం ఆమె విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అద్దెనపాలెం, ఎర్రవానిపాలెం, సుంకరపాలెం,కంతకపల్లి మీదగా ఆమె పాదయాత్ర సాగుతుంది. భీమాలి వద్ద దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ఆవిష్కరించనున్నారు.

తాజా వీడియోలు

Back to Top