227వ రోజుకు చేరిన షర్మిల యాత్ర

వెంకటాపురం (శ్రీకాకుళం) 01 ఆగస్టు 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్తానం పాదయాత్ర 227వ రోజుకు చేరింది. గురువారం ఉదయం ఆమె వెంకటాపురం గ్రామం నుంచి పాదయాత్రను  ప్రారంభించారు. పాదయాత్ర బుధవారం సాయంత్రం పలాస నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించింది.  పాలకొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర పూర్తిచేశారు. పాదయాత్ర చివరి మూడు రోజులూ యాత్ర  ఇచ్ఛాపురం వరకు పూర్తిగా జాతీయరహదారి మీదుగానే సాగుతుంది.

Back to Top