జగన్ వల్లే హోదా అంశం సజీవం

న్యూఢిల్లీ: ప్రత్యేక
హోదా అనేది ఇంకా సజీవంగా ఉన్నదంటే అది వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్
రెడ్డి వల్లనే అని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీ జంతర్
మంతర్ వద్ద జరుగుతున్న వంచన పై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్
రెడ్డి తనకున్న ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై వత్తిడి తెస్తే , చంద్రబాబు
నాయుడు మాత్రం ఆ ఊసెత్తకుండా, రాష్ట్రంలో కూర్చుని ధర్మ పోరాట దీక్షలంటూ ప్రజలను
మోసం చేస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వంపై మొట్టమొదటి సారిగా అవిశ్వాస
తీర్మానాన్ని పెట్టింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న అంశం దేశం మొత్తానికి
తెలుసునన్నారు. రాష్ట్రానికి మోసం చేసిన వారిలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే
ముందున్నారన్నారు. హోదా కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ సాగిస్తున్న పోరుకు ప్రజలందరూ
సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

తాజా వీడియోలు

Back to Top