సర్కార్‌కు చిత్తశుద్ధి ఉందా?

హైదరాబాద్, 25 ఆగస్టు 2012 : ఎస్సీ, ఎస్టీ సబ్­ ప్లాన్­పై కేబినెట్­ సబ్­కమిటీ నివేదిక రావడం సంతోషమే అని వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. అయినా దానిని అమలు చేయడం, చట్టబద్దత కల్పించడంపైనే ప్రభుత్వం చిత్తశుద్ది ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్­ప్లాన్­ నిధుల వినియోగం విషయంలో ఎలాంటి సమస్యలూ ఎదురు కాకూడదనే  వైయస్­ఆర్ కాంగ్రెస్­ పార్టీ చర్చకు, ప్రత్యేక బడ్జెట్­ సమావేశానికి డిమాండ్­ చేస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్­ ప్లాన్­పై అధ్యయనానికి ఏర్పాటైన కేబినెట్­ సబ్­ కమిటీ నివేదికపై సాక్షి చానల్­ శనివారం నిర్వహించిన ప్రత్యేక చర్చలో జూపూడి పాల్గొన్నారు.

వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్­ ప్లాన్­ అమలు, వారి కష్టాలపై ప్రత్యేక బడ్జెట్­ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనను సీనియర్­ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతించారు. ప్రభుత్వం తలచుకుంటే చట్టం చేయడంలో న్యాయపరమైన చిక్కులేవీ రాబోవన్నారు. అయితే సబ్­కమిటీ నివేదిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ మరో నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.

Back to Top