సమస్యలు పట్టని కిరణ్ సర్కారు: శ్రీనివాసులు

రైల్వే కోడూరు(వైయస్ఆర్ జిల్లా), 14 మే 2013:

వైయస్ఆర్ జిల్లాలలోని పల్లెల్లో తాగు, సాగు నీటికి తీవ్రమైన ఇబ్బంది ఉందని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన ఆరోపించారు. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన రిజర్వాయర్లను సీఎం పూర్తి చేసుంటే ఈ దుర్భిక్ష పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని ఆయన చెప్పారు.

Back to Top