సమస్యలను చర్చించే ధైర్యం ప్రభుత్వానికి లేదు

టి. నరసాపురం:

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించకపోవడానికి కారణం ప్రజా సమస్యలను చర్చించే ధైర్యం లేకపోవడమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషిచేశారనీ, ఆయన సేవలను రైతులు మరిచిపోలేదనీ చెప్పారు. సహకార ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై పోటీచేసినా  పార్టీ అభ్యర్థులదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బాలరాజు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top