సచివాలయానికి సీఎం కటౌట్‌ సోకులు

హైదరాబాద్, 31 ఆగస్టు 2012 : ఓ పద్ధతీ పాడూ లేని విద్యుత్ కోతలతో దిక్కుతోచక రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. పాలకులకు కొత్తగా ప్రచారం పిచ్చి పట్టుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పైసా విదల్చని ప్రభుత్వం, సొంత ప్రచారం కోసం నిధుల్నీ నీళ్లలా ఖర్చు పెడుతోంది. 108 వాహనాలపై కిరణ్‌ బొమ్మల కోసం లక్షలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. తాజాగా, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయాన్ని, కిరణ్ సర్కార్ ప్రచార వేదికగా చేసుకుంది. సెక్రటేరియట్ బ్లాకుల దగ్గర ముఖ్యమంత్రి కటౌట్లు, ఫోటోలు పెట్టి ప్రచార ఆర్భాటానికి తెర తీసింది.

తాజా ఫోటోలు

Back to Top