రైతులు కష్టాల్లో.. మంత్రులు ఢిల్లీలో...ఏలూరు

5 నవంబర్ 2012 : రాష్ట్రంలో రైతులు పంట నష్టమై కష్టాలలో ఉంటే మంత్రులు మాత్రం ఢిల్లీలో ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్.విజయమ్మ విమర్శించారు. ప్రభుత్వం బాధితులకు సహాయం అందించడంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. సోమవారం ఆమె పలు వర్ష బీభత్స ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని విజయమ్మ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామని ఆమె అన్నారు. వైయస్ఆర్ సీపీ శ్రేణులు బాధితులకు అండగా నిలుస్తాయన్నారు. వైయస్ లేకపోవడంతో రైతులు దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ సిఎం అయితే రైతుల సమస్యలకు శాశ్వతపరిష్కారం లభిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. రైతులు ధైర్యంగా ఉండాలనీ, త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుందనీ ఆమె ధైర్యం చెప్పారు.

Back to Top