బాబు దిమ్మతిరిగేలా నంద్యాల ప్రజలు తీర్పు ఇవ్వాలి

నంద్యాల: వైయస్సార్సీపీ బహిరంగ సభ వేదికగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ ఏమన్నారంటే....మనమందరం వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఆ రోజు వైయస్‌ఆర్‌ను బతికించడానికి, తన తండ్రిని అభిమానించిన వారికి అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకోవాలి. ఈ రోజు అన్ని పార్టీలు కక్షగట్టి వైయస్‌ జగన్‌ను జైలుకు పంపించారు. అయినా బెదరలేదు. రాయలసీమ ముద్దు బిడ్డ వైయస్‌ఆర్‌ కుమారుడు కాబట్టే బయపడలేదు. చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీ తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేశారు. మంత్రి పదవి వస్తుందని ఆశతో భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్తే మంత్రి పదవి రాక గుండెపోటుతో మృతి చెందారు. ఈ రోజు సంప్రదాయాలకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తుంది. ఈ గడ్డ వైయస్‌ఆర్‌సీపీ గడ్డ. 2009లో వైయస్‌ఆర్‌ పాలనను చూసి వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తెచ్చేందుకు, జగనన్నను సీఎం చేసేందుకు మీరంతా ఓట్లు వేశారు. ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్‌ అందిందంటే అది వైయస్‌ఆర్‌ హయాంలోనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదివారంటే అది వైయస్‌ఆర్‌ హయాంలోనే. ప్రాజెక్టులు కట్టి మన అందర్ని ఆశీర్వదించింది వైయస్‌ఆర్‌ మాత్రమే. ఈ రోజు చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓట్లు వేసినట్లే.  టీడీపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి జరగదు. అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతాయి. ఈ రోజు అరుదైన అవకాశం నంద్యాల ప్రజలకు వచ్చింది. 5 కోట్ల ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలు. మూడు సంవత్సరాలుగా దగా పడ్డ ప్రజలు ఎదురుచూస్తున్న ఎన్నికలు ఇవి. టీడీపీకి చెంపపెట్టులాగా ఈ ఎన్నిక ఉండాలి. అవినీతికి ఆధార్‌కార్డు, అబద్ధాలకు రేషన్‌కార్డు చంద్రబాబు.  ఎవరు కొడితే చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ పడుతుందో అ ఓటరే నంద్యాల అని గుర్తుండి పోవాలి. మహిష్మతి రాజ్యం పోయి బహుబలి పాలన రావాలి. 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కనీస అభివృద్ధి కూడా లేదు. సిగ్గులేకుండా మంత్రులు అయిన వారు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే రాజీనామా చేయాలి.

Back to Top