హైదరాబాద్ః శాసనసభను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా వాడుకుంటూ చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మహిళలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. <br/>చంద్రబాబుకు ఓటేసినందుకు రాష్ట్రంలోని మహిళలంతా చింతిస్తున్నారని చెప్పారు. మహిళల ఆగ్రహానికి బాబు బలైపోవడం ఖాయమన్నారు. విలువల గురించి బాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. మహిళలను వేధించడం, ఓటుకు కోట్లు కుంభకోణంలో పట్టుబడడం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడమేనా బాబు నీకున్న విలువలని ఎధ్దేవా చేశారు.