రేపు విజయవాడలో విజయమ్మ ధర్నా

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ సంక్షోభం నివారణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈనెల 17వతేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ధర్నాలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బందర్ రోడ్డులో ఉన్న విద్యుత్‌శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వివరించారు. కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర పార్టీ నాయకులు జలీల్‌ఖాన్‌తో సహా పలువురు నేతలు ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ తరపున ధర్నాలు జరుగుతాయని రఘురామ్ వెల్లడించారు. రైతు సమస్యలపై నేడు పులివెందులలో విజయమ్మ ధర్నా...
నష్టపోయిన పండ్ల రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పులివెందులలోని సీఎస్‌ఐ మైదానంలో విజయమ్మ సోమవారం ధర్నా చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ధర్నా నిర్వహిస్తారు. ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్ కాలువకు నీటిని వదలక పోవడం వల్ల చీనీ, అరటి సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తాజా ఫోటోలు

Back to Top