రాజీనామాకు సిద్ధం

  • వైయస్ జగన్ నాయకత్వంలో హోదా సాధిస్తాం
  • ప్రత్యేకహోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదు
  • బాబు, వెంకయ్యలు మాట తప్పారు
  • వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
నెల్లూరు : ప్రత్యేక హోదాకి ఏదీ ప్రత్యామ్నాయం కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. బాబుకు, వెంకయ్యనాయుడులకు దీని గురించి ఇంకా బాగా తెలుసు గనుకే  విభజన సమయంలో హోదాను గట్టిగా డిమాండ్ చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాను మరిచి ఆర్థిక సాయం మంచిదనడం దారుణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదానే కీలకమని నెల్లూరులో విలేకరుల సమావేశంలో ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రత్యేకహోదా వస్తే రాయితీలుంటాయి కాబట్టి పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని మేకపాటి తెలిపారు. హోదా ఉన్న ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏపీ నాయకులు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మేకపాటి స్పష్టం చేశారు. ఏపీకో హోదా ఇవ్వాల్సిందేనని రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో హోదాను సాధిస్తామన్నారు. తమ నాయకుడు ఆదేశిస్తే రాష్ట్రం కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top