దగా ప్రభుత్వంపై దండయాత్ర

*విశాఖలో వచ్చేనెల 6న జై ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభ 
*పోస్టర్ విడుదల చేసిన వైయస్సార్సీపీ నేతలు
*హోదా సాధించే వరకు పోరాటం ఆగదు
*విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన ప్రభుత్వాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. హోదాపై మొదటి నుంచి వైయస్‌ఆర్‌ సీపీ చేస్తున్న పోరాటం... సాధించే వరకు ఆగదని ప్రభుత్వాలను హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ‘జై ఆంధ్రప్రదేశ్‌’ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బహిరంగ సభలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 6వ తేదిన విశాఖలో మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్‌లో మొదటి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరగబోతున్న బహిరంగ సభలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, ప్రజానికం హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రజావ్యతిరేకత ప్రభుత్వానికి ఎవరూ భయపడరు
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు హోదాను ప్రధాన ఎజెండాగా చేసుకొని పోటీపడి 5, 10, 15 సంవత్సరాలు అంటూ ప్రజలను నమ్మించి మోసం చేశాయని అమర్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ వరకు హోదా కోసం పోరాటం చేస్తూ వస్తున్నారని చెప్పారు. ఆమరణదీక్షలు, బందులు, రిలే నిరాహార దీక్షల పేరుతో పోరాటం కొనసాగిస్తున్నారన్నారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పెషల్‌ ఎసిస్టెన్స్‌ అని ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేస్తూ విభజన చట్టంలోని ఆంశాలతో కూడిన ప్యాకేజీని ఇస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. 

చంద్రబాబు వంచనపై  ప్రజలను చైతన్య వంతులను చేస్తూ హోదా అవశ్యకతను వివరిస్తూ పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.  వైయస్‌ జగన్‌ యువభేరి సభకు హాజరైన యువత, విద్యార్థులపై పీడియాక్టులను పెట్టాలని బాబు  చెప్పడం సిగ్గుచేటన్నారు. అయినప్పటికీ నిన్న కర్నూలులో జరిగిన యువభేరికి పెద్ద ఎత్తున విద్యార్ధులు హాజరయ్యారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి భయపడే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను 25 అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌ సీపీ నిబద్ధతతో పోరాడుతుందని చెప్పారు. 
 
Back to Top