జగన్‌ కావాలి–మంచిరోజులు రావాలి..

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. అనంతపురంలోని ఆజాద్‌ నగర్‌లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ ధవళేశ్వరంలో వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డీనేటర్‌ ఆకుల వీ్రరాజు ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ నిర్వహించారు.  రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట పంచాయతీలో నిర్వహించిన  రావాలి జగన్‌ –కావాలి జగన్‌ కార్యక్రమంలో పార్టీ నేతలు అనంత ఉదయభాస్కర్, కోఆర్డీనేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి, కొమ్మిశెట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైయస్‌ఆర్‌సీపీలోకి  రామన్నదొర మండలానికి చెందిన 100 మంది కార్యకర్తలు చేరారు. వారికి వైయస్‌ఆర్‌సీపీ నేతలు పార్టీ  కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగ్గంపేట మండలం మామిడాడలో వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డీనేటర్‌ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  క్రరి శ్రీను,వేగు రాంబాబు, బండారు రాజా, అడబాల పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top