రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. కొన్నిచోట్ల నియోజకవర్గస్థాయి సమావేశాలు, మరికొన్ని ప్రాంతాలలో పార్టీలో చేరికలు, పోస్టర్ల ఆవిష్కరణ, ఇలా ఘనంగా సాగాయి.

ఆదిలాబాద్ జిల్లాలో..

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో నిర్మల్ నియోజకవర్గ సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదును యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ అల్లాడి వెంకటరమణకు సభ్యత్వం ఇచ్చారు. నిర్మల్ పట్టణం, దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), నర్సాపూర్(డబ్ల్యూ), వడ్యాల్, బాబాపూర్, కంకట, వైకుంఠాపూర్, చించోలి(ఎం), చిట్యాల్ తదితర గ్రామాలకు చెందిన 500 మంది పార్టీలో చేరారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం: వికలాంగుల సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత చెప్పారు.  వైఎస్సార్ వికలాంగుల సమితి నవంబర్ 29న హైదరాబాద్‌లోని నిజాం మైదానంలో నిర్వహించనున్న మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం అనంతపురం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.

పుట్టపర్తి అర్బన్: దాదిరెడ్డిపల్లిలోని 150 కుటుంబాలవారు పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ నాయకులు డాక్టర్ నాగేంద్ర కుమార్ రెడ్డి, డాక్టర్ హరిక్రిష్ణ, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు సమక్షంలో వారు కండువాలు ధరించి పార్టీలో చేరారు.

పుట్టపర్తి : కర్ణాటక నాగేపల్లి, నల్లగుట్ట కాలనీ, చిత్రావతి రోడ్డు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన 300 మంది స్థానిక సాయిఅరామం, టూరిజం గెస్ట్‌హౌస్‌ల వద్ద ఆది వారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
కదిరి: నల్లమాడ మండలం వేళ్లమద్ది గ్రామంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వంద మంది ఆదివారం ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ నాయకుడు కడపల మోహ న్‌రెడ్డి స్వగృహంలో నాయకులు మట్రా రాజశేఖర్ ఆధ్వర్యంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

చిత్తూరు జిల్లాలో..

రామకుప్పం: స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు ఓటు వేస్తే విలువ ఉండదని జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు.  సింగసముద్రం పంచాయతీలోని కుప్పిగానిపల్లి, జీడిమాకులపల్లి, సింగసముద్రం గ్రామాల్లో ఆదివారం గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టారు.  జీడిమాకులపల్లి గ్రామంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు.  సింగసముద్రం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు పార్టీలో చేరారు.

జగన్ విడుదల కోసం పాదయాత్ర

చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ నగరంలోని 31వ వార్డుకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినాయక క్షేత్రం కాణిపాకానికి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏఎస్.మనోహర్ ప్రారంభించారు.

2న పదివేల మందికి అన్నదానం: భూమన

తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న పది వేల మందికి అన్నదానం చేయనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు.  పెద్దాయన వర్ధంతి రోజున విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్ర మాలకు నగర ప్రజలను ఆహ్వానిస్తూ పార్టీ నగర శాఖ రూపొందించిన పోస్టర్లను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు.

మాలేనత్తం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన మళ్లీ రావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని, ఆయనను సీఎంను చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విజ్ఞప్తిచేశారు. ఆదివారం మాలేనత్తం గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.  మాలేనత్తం గ్రామంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరారు.

గుంటూరులో వైయస్ఆర్ వర్థంతి వారోత్సవాలు

గుంటూరు: ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ఎంతో మహోన్నతమైనదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు.  పార్టీ నాయకుడు కొత్త చిన్నప్పరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ మూడో వర్ధంతి వారోత్సవాలను గుజ్జనగుండ్ల సెంటర్‌లో విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు.
వైఎస్ పథకాల కనుమరుగుకు యత్నం

గుంటూరు: రాష్ర్ట ప్రజల అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు రావి వెంకటరమణ ఆరోపించారు. గుంటూరులోని ఏటీ అగ్రహారం మెయిన్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ మహ్మద్‌గౌస్ ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు విసిగిపోయారన్నారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 25వ డివిజన్‌లో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సీఈసీ సభ్యుడు రావి వెంకటరమణ ప్రారంభించారు. 

కడప జల్లాలో..

కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కళాకారులు కృషి చేయాలని ఆ పార్టీ సాంస్కాృతిక విభాగం జిల్లా కన్వీనర్ గంధం రాముడు పేర్కొన్నారు.  శంకరాపురంలోని జయడ్యాన్సు అకాడమీలో క ళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  త్వరలో సాంస్కృతిక విభాగం నియోజకవర్గ, మండల కమిటీలు ఏర్పాటు చే స్తామని, ఇందులో అన్ని రంగాల కళాకారులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top