హైదరాబాద్‌ నలుమూలల నుంచీ ర్యాలీలు!

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్‌ పార్టీ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ శనివారం నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో నలు మూలల నుంచీ అభిమానులు, సమైక్యవాదులు భారీ ఎత్తున ర్యాలీలుగా తరలివస్తున్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నేతృత్వంలో సమైక్యవాదులు సభకు తండోప తండాలుగా కదలివస్తున్నారు. దారి పొడవునా సమైక్య నినాదాలు చేస్తూ సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

- అంబర్‌పేట కార్పొరేటర్ కాలేరు వెంకటే‌ష్ ఆధ్వర్యంలో 3వేల మందితో బైక్‌ ర్యాలీ
- కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంఛార్జి వడ్డేపల్లి నర్సింహరావు నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ
- శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ
- సనత్‌నగర్ ఇంఛా‌ర్జి వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ
-‌ కుత్భుల్లాపూర్ ఇంఛా‌ర్పి కొలను శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ
- కేపీహెచ్‌బీలో జార్జి హెర్బట్ ఆధ్వర్యంలో 100 మీటర్ల వై‌యస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, ర్యాలీగా నాయకులు బయల్దేరారు.
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైయస్ఆర్ ‌కాంగ్రెస్ ‌నాయకుడు ఈసీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో సభకు వేలాదిగా కార్యకర్తలు‌ తరలి వచ్చారు.

కాగా, తెలంగాణలోకి ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి కూడా పార్టీ శ్రేణులు, అభిమానులు, సమైక్య వాదులు వేల సంఖ్యలో సమైక్య శంఖారావం సభకు శనివారం ఉదయమే తరలి వచ్చారు.

Back to Top