<br/><br/><br/>నెల్లూరు: నెల్లూరు నగర నియోజకవర్గంలోని 3, 4, 5వ డివిజన్లకు చెందిన ప్రజలకు మోడరన్ ఐ హాస్పిటల్ సహకారంతో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రాజన్న కంటి వెలుగు (ఉచిత కంటి వైద్య శిబిరం) కార్యక్రమాని విశేష స్పందన లభించింది. నెల్లూరు నగరంలోని సింహపురి కాలనీ లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు కొర్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేదన్నారు. మహానేత పేదల కోసం ఏర్పాటు చేసిన 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ ఇంటి ముందు వచ్చి వాలేదన్నారు. మెరుగైన వైద్యంతో ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఇంటికి వచ్చేవారన్నారు. మహానేత మరణం తరువాత ఈ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. మళ్లీ ఇలాంటి పథకాలు అమలు కావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.