చంద్రబాబు ప్రభుత్వంపై రజకులు మండిపాటు..వైయస్ జగన్‌కు కలిసి బా«ధలు చెప్పుకున్న రజకులు..శ్రీకాకుళంః 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని రజకులు మండిపడ్డారు. కనీసం ఒక హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను కలిసి తమ బాధలు మొరపెట్టుకున్నారు. రజకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పెన్షన్ల మంజురు చేయాలని వినతిపత్రం సమర్పించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి ఓటువేసునందుకు నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రజకులను పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులమని చెప్పి కక్ష సాధింపుచర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు.కులవృత్తిపై ఆధారపడ్డ తమకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు. వైయస్ జగన్ రజకుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని, 40 ఏళ్లకే పింఛన్ వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటానని భరోసా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.రజకుల సంఘం నేతలు వైయస్ జగన్‌కు మద్దతు తెలిపారు.