రైతులను కష్టపెడుతున్న ప్రభుత్వం: షర్మిల

పందికుంట:

రైతులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల పాలు చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ఆ షర్మిల విరుచుకుపడ్డారు. జగన్‌పై బూటకపు కేసులు పెట్టిందని ఆమె ఆరోపించారు. చంద్రబాబుకూ, కాంగ్రెస్ పార్టీకీ విశ్వసనీయత ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. పంతొమ్మిదో రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. దేవుడనే వాడున్నాడనీ.. మహానేత కూడా అక్కడే ఉన్నారనీ.. జరుగుతున్న విషయాలన్నింటినీ చూస్తున్నారనీ షర్మిల చెప్పారు. ఆమె ఈ మాటలన్నప్పుడు సభకు హాజరైన వారు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఈ ప్రభుత్వం అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న రాజ్యం ఏర్పడుతుందనీ అందరి కష్టాలూ తీరతాయనీ ఆమె వివరించారు.

Back to Top