ఎమ్మెల్యే బక్రీదు శుభాకాంక్షలు

ప్రొద్దుటూరు : బక్రీద్‌ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తన ఆత్మీయ సోదరులైన ప్రతి ముస్లిం కుటుంబానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అందరిపైన అల్లా దయ ఉండాలని, కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యంతో, సోదర ప్రేమతో కలసిమెలసి జీవించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తు కాలంలో ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు.

Back to Top