రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్, 12 మార్చి 2013:

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్బవించి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేతలు, కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తూరులో పార్టీ నేత ఏఆర్ మనోహర్ కేక్ కట్ చేసి పార్టీ జెండా ఎగురవేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైయస్‌ఆర్ సీపీ నేత ఆర్‌వీఎస్‌కేకే రంగారావు పేదలకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా మైలవరం కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పశ్చిగోదావరి జిల్లా ఆకివీడులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలు, వృద్ధ మహిళలకు చీరల పంపిణీ చేశారు.

Back to Top