రామయ్య వ్యాఖ్యలు దారుణం: కల్పన

హైదరాబాద్, 8 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సతీమణి శ్రీమతి భారతిని ఉద్దేశించి టిడిపి నాయకుడు వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ‌తప్పుపట్టారు. చంద్రబాబులా తమకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని చెప్పారు. ఎవరు చెబితే వర్ల రామయ్య మాట్లాడుతున్నారో తమకు తెలుసునని అన్నారు. అనుచిత వ్యాఖ్యలను చేసిన వర్ల రామయ్యను ప్రజలు చీదరించుకుంటున్నారని కల్పన అన్నారు.

Back to Top