రాజన్న హయాంలో ధనేశ్వరంగా మహేశ్వరం

మహేశ్వరం:

రాజన్న హయాంలో మహేశ్వరం ధనేశ్వరంగా మారిందని.. నేడు కిరణ్ పాలనలో ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా తుక్కుగూడలో ఆమె ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం లేకనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలేదని.. ఒకవేళ ఎన్నికలు పెడితే సీట్లన్నీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకొంటుందనే భయం వారిని వెంటాడుతోందని విమర్శించారు. జగనన్న సీఎం కాగానే మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తారన్నారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1000 చొప్పున ఫించన్లు అందజేస్తారన్నారు. ఇది తొందరలోనే నెరవేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.
జగనన్నను ఆదరించండి
     గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జగనన్న తప్పకుండా తీరుస్తారనీ.. అన్నను మీరంతా ఆదరించాలనీ శ్రీమతి షర్మిల అన్నారు. అంతకుముందు మహేశ్వరంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళలను, రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. బాబు హయాంలో రాష్ట్రంలో సుమారు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు.  
సమస్యలను విన్నవించిన గిరిజనులు, రైతులు, వృద్ధులు
     మహేశ్వరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళలు తమ సమస్యలను షర్మిలకు ఏకరువు పెట్టారు. ఒక్కో ఇంటికి నెలకు రూ.800 కరెంటు బిల్లు వస్తోందని, ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలేదన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గిరిజన తండాలు, గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకోవడంలేదని షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. సిరిగిరిపురం జరిగిన రచ్చబండలో స్థానికులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. రైతులను పీడించి వ్యవసాయ కరెంటు బిల్లులు, సర్‌చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. గ్రామంలో తాగడానికి సరిపడా నీరు కూడా లేదని.. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
     ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగనన్న సీఎం కాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. హర్షగూడలో పలువురు మైనారిటీ మహిళలు సమస్యలను షర్మిల దృష్టికి తెచ్చారు. ‘వైఎస్ హయాంలో మంజూరైన వృద్ధాప్య పిం ఛన్లు కూడా ప్రస్తుతం చాలా మందికి రావ డం లేదు..తిరిగి అందరికీ గతంలో మాదిరే పింఛ న్లు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుందమ్మా’ అంటూ పలువురు వృద్ధులు అభిప్రాయపడ్డారు. మంఖాల్ గ్రామం సమీపంలోని చేలల్లో ఉన్న రైతుల వద్దకు షర్మిల వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడంలేదని వారు ఆమెతో వాపోయారు. విత్తనాల ధర కంటే కూడా మద్దతు ధర తక్కువగా ఉందని, ఇలాగైతే అప్పుల ఊబి నుంచి రైతులు బయటపడేదెట్లమ్మా... అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

Back to Top